పాక్ డబుల్ గేమ్పై యూఎస్ సీరియస్!

9 Jul, 2016 12:38 IST|Sakshi

వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు ఉగ్రవాదంపై పోరు విషయంలో.. పాకిస్తాన్ మిత్రువా లేక శత్రువా అనే విషయంపై చర్చ నిర్వహించాలని యూఎస్ చట్ట సభల ప్రతినిధులు నిర్ణయించారు. వచ్చేవారం ఈ సమావేశం నిర్వహించనున్నట్లు యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, టెర్రరిజంపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్ తెలిపారు.

తీవ్రవాదానికి వ్యతిరేకం అంటూ చెబుతూనే అంతర్గతంగా టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు నడుపుతున్న ఆ దేశ వైఖరిపై చర్చించడం వల్ల.. చట్ట సభల సభ్యులకు పాకిస్తాన్ విషయంలో అవలంభించాల్సిన విదేశీ విధానంపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలు ఇప్పటికీ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నాయని మరో సభ్యుడు సల్మొన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు