కరోనాతో చెలగాటమాడాడు, ప్రాణాలు పొగొట్టుకున్నాడు

13 Jul, 2020 14:50 IST|Sakshi

టెక్సాస్‌:ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ లక్షల మంది కరోనా బారిన పడి మరణిస్తున్న కొంత మంది ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వారందరూ ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతూ, పార్టీలంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. కరోనా బారిన పడిన యువకలకు ఏం కాదనో అపోహలో ఇప్పటికి చాలా మంది ఉన్నారు. అయితే కరోనా వారు వీరు అనే తేడా లేకుండా అందరి పై ప్రభావం చూపుతోంది. యుక్త వయసువారిపై కరోనా ఎలా ప్రభావం చూపుతోంది తెలిపేందుకు టెక్సాక్‌లో జరిగిన ఒక ఉదాహరణను తెలిపారు డాక్టర్‌ జానే అపిల్‌బే. టెక్సాక్‌కు చెందిన ఒక వ్యక్తి యువకులకు కరోనా సోకిన ఏం కాదు, అందరూ కరోనా గురించి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు అని భావించారు. వారి స్నేహితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా, అతను మీరు ఎవరైతే కరోనాను ఎదిరించగలని నమ్ముతున్నారో వారు పార్టీకి రాగలరు అని పిలవడంతో అక్కడికి వెళ్లాడు. 

చదవండి: కరోనా కాటు: వ్యాపార సెంటిమెంట్‌ బేజారు

తరువాత అతనికి కూడా కరోనా సోకింది. కరోనాను ఎదర్కోగలనని భావించినప్పటికి అతని ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గి మరణించాడు. చివరి నిమిషంలో అతడు నర్స్‌తో మాట్లాడుతూ, మీకు తెలుసా, నాకెందుకు తప్పు చేశాననిపిస్తోంది అని అన్నాడు. ఈ విషయంపై డాక్టర్‌ మాట్లాడుతూ, కరోనా సోకినప్పుడు ఒక వ్యక్తి ఎంతగా జబ్బు పడతాడే అతనికే తెలియదు. పైకి  ఆరోగ్యంగా కనిపిస్తున్న ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. టెస్ట్‌లు చేస్తేనే వారి పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం అవుతుంది అని తెలిపారు. ఇక అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. బాధ్యత లేకుండా, కరోనా నియమాలు పాటించకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు తిరగడం వల్లే ఇలా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న 20 మందికి పాజిటివ్​​​​​​​

>
మరిన్ని వార్తలు