పాక్‌ సాయంలో అమెరికా భారీ కోత

3 Sep, 2018 05:34 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా, పాకిస్తాన్‌ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై మరో దెబ్బపడింది. ఉగ్ర గ్రూపులను కట్టడి చేసేందుకు పాక్‌ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ 30 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,130 కోట్లు) సాయాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 5న పాక్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భేటీ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక పాక్‌ విషయంలో అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అఫ్గానిస్తాన్‌లో మోహరించిన తమ బలగాలపై దాడులకు పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు కోరినా స్పందించనందుకు పాక్‌పై గుర్రుగా ఉంది.

మరిన్ని వార్తలు