కరోనా వైరస్‌కు అమెరికా పౌరుడు బలి

8 Feb, 2020 11:48 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

బీజింగ్‌:  కరోనా రేపిన వైరస్‌ ప్రకంపనలు రోజుకు రోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో 700 మందికి పైగా పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి విజృంభిస్తున్న తీరు మరింత ఆందోళన రేపుతోంది.   కరోనా  మోగిస్తున్న మృత్యు ఘంటికలు  వివిధ దేశాలను వణకిస్తున్నాయి. తాజాగా కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన అమెరికా పౌరుడు (60) ఫిబ్రవరి 6న చైనాలోని వుహాన్‌లో ఆసుపత్రిలో మరణించాడు. బీజింగ్ లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. బాధిత కుటుంబానికి  ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి వుహాన్‌ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ చనిపోయాడు. అయితే కరోనా వైరస్‌ను నిర్ధారించలేమని, తీవ్రమైన న్యుమోనియా కారణమని   భావిస్తున్నట్టు రాయబార కార్యాలయ ప్రకటన తెలిపింది.

చైనాలో ఇప్పటికే 722 మంది వైరస్ బారినపడి  ప్రాణాలు కోల్పోగా, 34వేల మందికి పైగా ఈ వరస్‌ సోకినట్లు తాజా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం నాటికి, కరోనావైరస్ సోకిన  విదేశీయుల19 కేసులు నమోదయ్యాయి, వాటిలో ఇద్దరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగా, మిగిలిన  17 మంది  ఇంకా చికిత్స పొందుతున్నారు. 
 

మరిన్ని వార్తలు