అమెరికా అణుబాంబు పరీక్ష విజయవంతం

16 Apr, 2017 03:25 IST|Sakshi

అల్బక్వెర్క్యు: ఆధునీకరించిన ‘బీ61–12’అణుబాంబు తొలి పరీక్ష విజయవంతమైనట్టు శాండియా నేషనల్‌ లేబొరేటరీస్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. గత మాసంలో నెల్లిస్‌ వైమానిక స్థావరానికి చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానం నుంచి నెవేడా ఎడారి ప్రాంతంలో ఈ బాంబును వదిలారు.

‘బాంబు డిజైన్, దాన్ని మోసుకెళ్లిన యుద్ధవిమానం... అన్నీ సరిగ్గా అమరి పరీక్ష విజయవంతమైంది’అని శాండియా స్టాక్‌పైల్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.  2020 నాటికి బీ61–12 ప్రాజెక్ట్‌ పూర్తికావాల్సి ఉంది. రాబోయే మూడేళ్లలో మరిన్ని ప్రయోగ పరీక్షలు జరుపుతామని శాండియా తెలిపింది.

మరిన్ని వార్తలు