చెన్నైకి అమెరికా అండదండలు!

4 Dec, 2015 07:05 IST|Sakshi

వాషింగ్టన్: భారీ వర్షాల ప్రభావానికి గురై వరదల్లో కొట్టుమిట్టాడుతున్న చెన్నై నగరాన్ని ఆదుకునేందుకు అమెరికా కూడా ముందుకొచ్చింది. తమ దేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వామి దేశమైన భారత్లో ఎలాంటి కష్టం ఏర్పడినా తాము స్పందిస్తామని, అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని అమెరికా అధికారి మార్క్ టోనర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా భారత్ తరుచు వరదల ప్రమాదాలు ఎదుర్కొంటుందని, ప్రస్తుతం తమిళనాడులోని చెన్నై పరిస్థితి దయనీయంగా మారిందని, పరిస్థితి తమ హృదయాలను ద్రవింపజేసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆ ప్రాంతం పట్ల తమ సానుభూతిని ప్రకటిస్తూ వారికి ఎలాంటి సహాయమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. తమిళనాడులో పరిస్థితులను తాము ఇప్పటికే భారత అధికారులను అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. అయినా, భారత్ కూడా స్వయంగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగల సత్తా ఉన్న దేశమని చెప్పారు. అయినప్పటికీ తమ వంతుగా సహాయం చేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. 

మరిన్ని వార్తలు