బీమా చెల్లించకుంటే రాకండి

6 Oct, 2019 04:03 IST|Sakshi

వలసదారులకు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: అమెరికా వెళ్ళేందుకు సమాయత్తమౌతోన్న వేలాది మంది భారతీయుల ఆకాంక్షలపై ట్రంప్‌ తాజా ఆదేశాలు నీళ్ళు చల్లుతున్నాయి. ఆరోగ్యబీమా ఉన్నదని రుజువు చేసుకోలేని వారినీ, వైద్యఖర్చులను భరించలేని వారినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న వీసానిరాకరణ నిర్ణయం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆరోగ్యబీమా లేకుండా, వైద్యబిల్లులు చెల్లించే ఆర్థిక స్థోమత లేకుండా అమెరికాలోకి అడుగుపెట్టే వలసదారులను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారంతేల్చి చెప్పారు. అంతేకాకుండా అమెరికా ఆరోగ్య వ్యవస్థపై అదనపు భారం కాబోమని నిరూపించుకున్న వారినే అనుమతించాలని అధికారులను ట్రంప్‌ ఆదేశించారు. అమెరికా పౌరుల్లోకంటే ఆరోగ్యబీమా లేని చట్టబద్దమైన ప్రవాసులు మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు ట్రంప్‌ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఆరోగ్యవ్యవస్థకీ, పన్నులు చెల్లిస్తోన్న అమెరికా పౌరులకువలసదారుల వల్ల ఖర్చు పెరగకూడదని ట్రంప్‌ భావిస్తున్నట్టు వైట్‌ హౌస్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు