గూగుల్‌కు ఊహించని షాక్‌

26 Jul, 2019 13:22 IST|Sakshi

డెమెక్రాట్‌ తులసి గబ్బర్డ్‌  గూగుల్‌పై ఆగ్రహం 

అక్రమంగా తన ఖాతాను నిలిపివేశారని  ఆరోపణ

50 మిలియన్‌ డాలర్ల  దావా

వాషింగ్టన్‌ : టెక్‌ దిగ్గజం గూగుల్‌కు అమెరికాలో ఊహించని షాక్‌ తగిలింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ముందు వరుసలో  ఉన్న డెమోక్రాట్‌ ప్రతినిధి తులసి గబ్బర్డ్‌ గూగుల్‌పై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. తన ప్రచార ప్రకటనల ప్రసారాలపై గూగుల్‌ వివక్షా పూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ లాస్ఏంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. 50 మిలియన్‌ డాలర్ల (సుమారు 345 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

న్యూయార్క్‌ కథనం ప్రకారం ఒక రాజకీయ ప్రతినిధి టెక్‌ దిగ్గజంపై దావా వేయడం ఇదే మొదటిసారి. జూన్ 27-28 తేదీల్లో రాత్రిపూట ఆరు గంటలపాటు ప్రచారం తమ ప్రకటనల ఖాతాను గూగుల్ నిలిపివేసిందని గబ్బర్డ్  ప్రచార కమిటీ తులసి నౌ ఇంక్. ఆరోపించింది.  తద్వారా తమకు  50 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది.

తన ప్రచార అకౌంట్‌ గంటల తరబడి ఆఫ్‌లైన్‌లోనే ఉందనీ, ఎలాంటి వివరణ లేకుండా నిలిపివేసిందని గబ్బార్డ్ ఆరోపించారు. ఇంటర్నెట్ శోధనలో గూగుల్‌ గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమైనదో గూగుల్‌ వైఖరి ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ధోరణి భావస్వేచ్ఛకు, నిష్పక్షపాత ఎన్నికలకు, అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. అయితే అమెరికా ప్రజల తరపున దీనిపై తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు.

మరోవైపు గబ్బర్డ్‌ ఆరోపణలపై స్పందించిన గూగుల్‌,  తులసి గబ్బర్డ్‌ ఖాతాలో అసాధారణ యాక్టివిటీ మూలంగానే ఆ అకౌంట్‌ బ్లాక్‌ అయిందని వివరించింది. తమ సిస్టంలోని ఆటోమేటిక్‌ ఫ్రాడ్‌ ప్రివెన్షన్‌  ఫీచర్‌ కారణంగా  తాత్కాలిక షట్‌డౌన్‌కు దారితీసిందని గూగుల్ పేర్కొంది.

మరిన్ని వార్తలు