ట్రంప్‌ మరో షాక్‌ : ఐటీ కంపెనీలకు పెనుభారమే

7 May, 2019 19:34 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పడనుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు ట్రంప్‌ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్‌ ప్రొగ్రామ్‌కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్‌ అకోస్టా తెలిపారు.ఈ మేరకు 2020 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదనలు చేర్చారు.  అయితే ఏఏ కేటగిరీల వ్యక్తులకు ఈ పెంపు వర్తిస్తుంది అనేది  స్పష్టం చేయలేదు.  

తాజా నిర్ణయంతో భారతీయ ఐటీ కంపెనీలపై భారం పడనుంది. తమ ఉద్యోగులను అమెరికా పంపాలనుకునే భారత ఐటీ సంస్థలు హెచ్-1బీ దరఖాస్తు రుసుంను భరించాల్సి ఉంటుంది. ఇది ఆయా సంస్థలకు అదనపు భారంగా పరిణమించనుంది. కాగా, ఈ పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమెరికా యువతకు సాంకేతిపరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కోసం వినియోగించనున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వలసలపై ఉక్కుపాదం మోపుతుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి  ఐటీ ఉద్యోగులకు సంబంధించిన  హెచ్-1బీ వీసాపై ఇప్పటికే  పలు కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. తాజాగా హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచాలని నిర్ణయించడం భారతీయ ఐటీ ఉద్యోగులకు కూడా షాకింగ్‌ న్యూసే

మరిన్ని వార్తలు