పాక్‌ ప్రధాని తనిఖీపై అమెరికా వివరణ

30 Mar, 2018 09:47 IST|Sakshi

న్యూ ఢిల్లీ : అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ భద్రతా తనిఖీలు ఎదుర్కొన్నారనే వార్తలు, దానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవ్వడంతో తమ ప్రధాని పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని అమెరికాపై పాక్‌ గుర్రుగా ఉంది. అయితే తాము ఎందుకు అలా  వ్యవహరించాల్సి వచ్చిందో అమెరికా అధికారులు గురువారం వెల్లడించారు. పా​క్‌ ప్రధాని వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వచ్చారని, మిగిలిన ప్రయాణికుల మాదిరే ఆయన కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని..అందుకే తాము అబ్బాసీని కూడా తనిఖీ చేసామని, వ్యక్తిగత పర్యటనలు చేసేవారు ఎవరైనా ఇందుకు మినహాయింపు కాదని యూఎస్‌ డిప్యూటీ ప్రతినిధి అలెగ్జాండర్‌ మెక్‌లారెన్‌ మీడియాకు వెల్లడించారు. 

ఆయన పర్యటన అధికారిక పర్యటన అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు వేరుగా ఉండేవన్నారు. పాక్‌ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అబ్బాసీ అనారోగ్యంతో ఉన్న తన సోదరిని సందర్శించడానికి అమెరికా వెళ్లారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు