పాకిస్తాన్‌కు అమెరికా బిగ్‌ ఝలక్‌

9 Dec, 2017 13:58 IST|Sakshi

అమెరికన్లూ.. పాక్‌లో ప్రయాణాలు మానుకోండి

ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి

తమ పౌరులను హెచ్చరించిన అమెరికా

నిన్న చైనా... నేడు అమెరికా

వాషింగ్టన్‌ : పాకిస్తాన్‌లో ప్రయాణించడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత సురక్షితం కాదని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పాకిస్తాన్‌లో అమెరికన్లపై దాడులు జరిగే అవకాశ ముందని.. అందువల్ల ఆ దేశంలో ప్రయాణాలు చేయరాదని అమెరికా ప్రకటించిం‍ది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. ఈ మధ్యకాలంలో క్వెట్టా, చమన్‌, ఖైబర్‌, ఫక్తున్వా ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులను అమెరికా ఉదాహరణులుగా పేర్కొంది.

ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌, లాహోర్‌లలోని అమెరికా రాయబార కార్యాలయాలు చాలా వరకూ వివిధ సేవలను నిలిపేశాయి. ప్రధానంగా పెషావర్‌లో ఉన్న రాయబార కార్యాలయంలో ఇప్పటికే కాన్సులర్‌ సేవలను అందించడం లేదు. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలు.. దేశంలో ఉగ్రవాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వాషింగ్టన్‌కు నివేదిక​అందిచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, మానవతా దృక్ఫథంతో సేవలు చేస్తున్న ఎన్‌జీఓలు, విదేశీ రాయబారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయని వైట్‌హౌస్‌కు పంపిన నివేదికలో పేర్కొన్నాయి. అంతేకాక అమెరికా దౌత్యాధికారులపై ఉగ్రవాదులు కక్షను పెంచుకున్నారని అందులో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు