వైరస్‌లను తరిమికొట్టే కోటింగ్‌ సృష్టి

15 May, 2020 07:48 IST|Sakshi

న్యూయార్క్‌: కరోనాపై పోరులో నిమగ్నమైన వైద్య సిబ్బంది రక్షణకు సాయపడే పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌)ల కిట్‌ మీద పేరుకుపోయే వైరస్‌లను అంతంచేసే కోటింగ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, వైద్యంలో వాడే వస్త్రాలు, ఇతర పీపీఈ కిట్‌లపై ఇన్నాళ్లూ ఎలాంటి కోటింగ్‌ లేకపోవడంతో వాటిపై భారీగా వైరస్, బ్యాక్టీరియా పేరుకుపోతున్నాయి. దీంతో వాటిని ఒక్కసారి మాత్రమే వాడేసి పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో పీపీఈల కొరత కూడా ఎక్కువైంది. (కరోనా మృతులు 3 లక్షలు)

కరోనాను కట్టడిచేయాల్సిన ఈ తరుణంలో ఈ సమస్యకు పరిష్కారంగా కోటింగ్‌ను అమెరికాలోని పీట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ అధునాతన కోటింగ్‌ను మాస్క్‌లు, గ్లౌజ్‌లు, వైద్యానికి వాడే వస్త్రాలపై పూసి వాటిని వాడుకోవచ్చు. వాడేశాక బాగా ఉతికేసి మళ్లీ వాడుకోవచ్చు. ఉతికినా వాటిపై ఉండే కోటింగ్‌ పోదు. అంతే శక్తివంతంగా పనిచేస్తుంది. దీంతో పీపీఈలు వృథాకావు. (అవి తగ్గడంతోనే రిస్క్‌ పెరిగింది)

మరిన్ని వార్తలు