గ్రీన్‌కార్డు విధానంపై సెనేటర్‌ నిర్వేదం

23 Jul, 2020 13:09 IST|Sakshi

సంస్కరణలకు పిలుపు

వాషింగ్టన్‌ : అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డు పొందేందుకు ఓ భారతీయుడు 195 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రముఖ రిపబ్లికన్‌ సెనేటర్‌ వెల్లడించారు. ఈ సమస్యను అధిగమించేందుకు చట్టబద్ద పరిష్కారానికి ముందుకు రావాలని సహచర సెనేటర్లకు ఆయన విజ‍్క్షప్తి చేశారు. వలసదారులను అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించేలా గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. ప్రస్తుత గ్రీన్‌కార్డు విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సెనేటర్‌ మైక్‌ లీ పిలుపు ఇచ్చారు. వలసదారు మరణించిన సందర్బాల్లో వారి గ్రీన్‌కార్డు దరఖాస్తును నిరాకరిస్తుండటంతో వలసదారు సంతానానికి ఈ విధానం ఉపకరించడం లేదని లీ పేర్కొన్నారు.

‘భారత్‌ నుంచి ఇప్పుడు ఎవరైనా బ్యాక్‌లాగ్‌లో చేరితే ఈబీ-3 గ్రీన్‌కార్డు కోసం 195 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిఉంటుందని అన్నారు. గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వలస ఉద్యోగులు, వారి పిల్లల ప్రయోజనాలను కాపాడాలిని కోరుతూ సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ లీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక వర్క్‌ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు గ్రీన్‌కార్డులు కీలకమని చెప్పారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుల పెండింగ్‌తో వారి కుటుంబాలు ఏళ్లకు ఏళ్లు నిరీక్షించడంతో వారు తమ వలస హోదాను కోల్పోతున్నారని సెనేటర్‌ డర్బిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్‌

మరిన్ని వార్తలు