డ్రాగన్‌పై మండిపడ్డ అమెరికా

2 Jun, 2020 08:43 IST|Sakshi

చైనాకు పెద్దన్న హితవు

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ పట్ల చైనా దుందుడుకు వైఖరిని అమెరికా దుయ్యబట్టింది. లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌కు వ్యతిరేకంగా చైనా దూకుడు ఆందోళనకరమని అమెరికా సెనేట్‌ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్‌ ఎలియట్‌ ఏంగెల్‌ అన్నారు. నిబంధనలకు అనుగుణంగా దౌత్యపరంగా సంప్రదింపుల ద్వారా సరిహద్దు సమస్యలను చైనా పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా వైఖరి సహేతుకం కాదని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా పొరుగు దేశాలను అణిచివేసే వైఖరిని చైనా ప్రదర్శిస్తోందని ఏంగెల్‌ వ్యాఖ్యానించారు. దేశాలన్నీ ఒకే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. బలవంతుడిదే రాజ్యం అనే ప్రపంచంలో మనం లేమని చైనా గుర్తెరగాలన్నారు.

చదవండి : అమెరికాను కమ్మేసిన ఆందోళనలు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా