అమెరికాలోనూ అదే తీరు, వారంలో రెండోసారి 

12 Mar, 2020 19:44 IST|Sakshi

ఇన్వెస్టర్లను మెప్పించలేని ‍ ట్రంప్‌  ప్రసంగం

తీవ్ర నష్టాలు, నిలిచిపోయిన ట్రేడింగ్‌

అమెరికా మార్కెట్లు మరోసారి  కుప్పకూలాయి.  దాదాపు షేర్లు  అన్నీ పాతాళానికి పడిపోవడంతో మరోసారి 15 నిమిషాల బాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఆరంభంలోనే ఎస్‌ అండ్‌  పీ 7 శాతం పతనం కాగా, డౌజోన్స్‌  20 శాతానికి పైగా నష్టపోయింది.  దాదాపు   ప్రధాన షేర్లు అన్నీ లోయర్‌స్క్యూట్‌ వద్ద  ఫ్రీజ్‌ అయ్యాయి.  దీంతో అమెరికాలో  షేర్ల గురువారం నాటి మహా పతనం కారణంగానే అమెరికా మార్కెట్లు  కూడా భారీగా నష్టపోతున్నాయి.కాగా దేశీయంగా స్టాక్‌మార్కెట్లు సుమారు 3వేల పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. స్టాక్‌మార్కెట్‌ చర్రితలోనే ఇంట్రాడేలో ఇంత భారీ పతనాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి.

కాగా  కోవిడ్‌-19 (కరోనా వైరస్)  ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ వేగంగా  విస్తరిస్తున్న నేపథ్యంలో యూరప్‌ పై ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తున్నట్టు  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.  యూరప్‌నుంచి  అన్ని ప్రయాణాలను 30 రోజుల పాటు నిషేధిస్తున్నట్టుతెలిపారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఓవల్ కార్యాలయం నుంచి గురువారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో అధ్యక్షుడు ట్రంప్ కరోనావైరస్ వ్యాప్తితో ప్రభావితమైన చిన్న వ్యాపారాలకు తక్కువ రేట్లకే రుణాలు అందించేలా 50 బిలియన్ డాలర్ల నిధులను కోరనున్నట్లు చెప్పారు. అయితే  ఈ  మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంబంధించిన వైద్యపర చర్యలు, ఆర్థిక వ్యవస్థ రక్షణ చర్యలేవీ ప్రకటించకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు ప్రభావితమైందని అక్కడి ఎనలిస్టులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు