'బాత్రూంలోకి వారిని కూడా అనుమతించండి'

13 May, 2016 11:04 IST|Sakshi
'బాత్రూంలోకి వారిని కూడా అనుమతించండి'

వాషింగ్టన్: ఇక నుంచి లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్స్) చేసుకున్నవారిపట్ల వివక్ష చూపడానికి వీల్లేదంటే అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఇలాంటివి జరగొద్దని నొక్కి చెప్పింది. లింగమార్పిడి చేసుకున్నవారికి ఆయా పాఠశాలల్లో, కాలేజీల్లోని బాత్రూంలలోకి అనుమతించడం లేదని, ఈ సమస్య ఉత్తర కరోలినాలో అధికంగా ఉందని, దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆదేశించింది.

త్వరలోనే అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రత్యేక మార్గదర్శకాలు పంపించనుంది. అయితే, ఏ చట్టం ప్రకారం ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారనే విషయం స్పష్టం చేయకుండా కేవలం విద్యాశాఖ అధికారుల సంతకాలతో ఈ లేఖలను ఆయా విద్యాసంస్థలకు పంపిచనున్నారు.  లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకు బాత్రూంలలోకి అనుమతి లేకుండా నార్త్ కరోలినా ఒక చట్టాన్ని చేసింది.

అయితే, ఈ చట్టం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేలా ఉందని, దీనిని మార్చాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా నార్త్ కరోలినాకు ఫెడరల్ గవర్న మెంట్ కు మధ్య తీవ్ర వైరుధ్యాలు కూడా వచ్చాయి. దీంతో అమెరికా విద్య, న్యాయశాఖలు ఈ అంశంలో జోక్యం చేసుకుని తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. లింగమార్పిడి చేసుకున్నవారికి వారి వారి గుర్తింపు ప్రకారం బాత్ రూంలలోకి అనుమతించాలంటూ అందులో పేర్కొననుంది.
 

>
మరిన్ని వార్తలు