మోదీ అలా చెప్పగానే..

10 Jun, 2016 11:23 IST|Sakshi
మోదీ అలా చెప్పగానే..

వాషింగ్టన్: తమ దేశం నుంచి ఎలాంటి దాడులు ఇండియాపై చేయబోమని పాకిస్థాన్ హామీ ఇవ్వాలని అమెరికా కోరింది. తమ పొరుగు దేశంలోనే ఉగ్రవాదం పెంచిపోషిస్తున్నారని అమెరికా కాంగ్రెస్స్ లో మోదీ ప్రసంగం చేసిన అనంతరమే పాక్ ను అమెరికా ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'ఇండియాపై ఎలాంటి దాడులు జరగబోవని పాకిస్థాన్ హామీ ఇవ్వాలి. ఇలా చేయడం పాకిస్థాన్, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తీసుకునే చర్యల్లో మరో మెట్టు అవుతుంది' అని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు.

ఎలాంటి ఉగ్రవాదానికి తాము తావు ఇవ్వబోమని పాక్ స్పష్టం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే, అన్ని రకాల ఉగ్రవాదాలు పాకిస్థాన్లోనే పెంచిపోషిస్తున్నారని మాత్రం తాను అనబోనని, అదే సమయంలో అలాంటి ఛాయలకు పాక్ అవకాశం ఇవ్వకూడదని అన్నారు. భారత్, పాకిస్థాన్లతో తమ సంబంధాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. కానీ ఉగ్రవాదం నిరోధం విషయంలో మాత్రం తమది ఒకే వైఖరి అని చెప్పారు.

>
మరిన్ని వార్తలు