అమెరికా మార్కెట్లు ఢమాల్‌ : ట్రేడింగ్‌ నిలిపివేత

9 Mar, 2020 19:57 IST|Sakshi

కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) గ్లోబల్‌ మార‍్కెట్లను పట్టి పీడిస్తున్నాయి. తాజాగా  అమెరికా మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎస్ అండ్‌ పీ 500 7 శాతం, నాస్‌డాక్‌ కంపోజిట్‌ 7.1 శాతం కుప్పకూలింది. బెంచ్ మార్క్ డౌజోన్స్ ఇండస్ట్రీయిల్‌ యావరేజ్‌ 2000 పాయింట్లకు పైగా (7.8శాతం) నష్టపోయింది. భారీ నష్టాల నేపథ్యంలో  న్యూయార్క్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ను నిలిపివేశారు.  2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఇదే అదిపెద్ద పతనంగా నిపుణులు తెలిపారు.15 నిమిషాలు పాటు ట్రేడింగ్‌ నిలిపివేయడంమంటేనే అమ్మకాల సెగ ఏ స్థాయిలో వుందో అంచనా వేయవచ్చు. 15 నిమిషాల తరువాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనా భారీ నష్టాలుకొనసాగుతున్నాయి. 

అటు చమురు ధరలు రికార్డు కనిష్టానికి చేరడంతో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో 2450 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరికి 1942 నష్టంతో ముగిసింది. జపాన్ నిక్కీ 225 సూచీ 5శాతం, క్షీణించగా, ఆస్ట్రేలియా మార్కెట్లు 7.3 శాతం కుప్పకూలాయి. చైనాలో, షాంఘై కాంపోజిట్ బెంచ్ మార్క్ 3శాతం, పడిపోగా, హాంగ్ సెంగ్ ఇండెక్స్ 4.2 శాతం క్షీణించింది. దీంతో మహా పతనంగా, బ్లాక్‌ మండేగా విశ్లేషకులు అభివర్ణించారు. వైరస్‌ భయాలకు తోడు సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్‌ వార్‌ కారణంగా చమురు ధర సోమవారం దాదాపు 30 శాతం క్షీణించి 31.14 డాలర్లకు చేరుకుంది. ఇది 1991లో గల్ఫ్ యుద్ధం ప్రారంభం తరువాత ఇదే అతిపెద్ద సింగిల్-డే పతనం. ఇంతటి పతనాన్ని ఇటీవలి కాలంలోచూడలేదని సెవెన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్‌మెంట్‌ సహ వ్యవస్థాపకుడు జస్టిన్ ఉర్క్హార్ట్-స్టీవర్ట్ వ్యాఖ్యానించారు.

చదవండి :  రిలయన్స్‌కు చమురు షాక్‌

కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్‌ కుదేలు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు