పాకిస్థాన్ కు అమెరికా సూచన

2 Nov, 2016 11:14 IST|Sakshi
పాకిస్థాన్ కు అమెరికా సూచన

వాషింగ్టన్: హింసను ప్రోత్సహించవద్దని పాకిస్థాన్ లోని అన్ని రాజకీయ పార్టీలను అమెరికా కోరింది. భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుత ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. హింసాత్మక విధానాలకు దూరంగా ఉండాలని సూచింది. 'సమూహ స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. తదనుగుణంగా మెలగుతుంటాం. శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు అందరికీ ఉంద'ని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఆందోళన నిర్వహించే రాజకీయ పార్టీలు హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని, సంయమనంతో వ్యవరించాలని సూచించారు.

పాకిస్థాన్ లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు. అయితే పాకిస్థాన్ లో ప్రభుత్వాన్ని సైన్యం నియంత్రింస్తోందన్న ఆరోపణలపై స్పందించేందుకు కిర్బీ నిరాకరించారు. ఇది పాకిస్థాన్ అంతర్గత విషయమని, దీనిపై కామెంట్ చేయబోనని చెప్పారు. పాకిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలను కనిపెట్టి చూస్తున్నామని వెల్లడించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను గద్దె దించేందుకు పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘ఇస్లామాబాద్ ముట్టడి’కి మంగళవారం పిలుపుయిచ్చారు. పనామా పత్రాల కుంభకోణంలో షరీఫ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో ఇమ్రాన్ ఖాన్ తన ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.

మరిన్ని వార్తలు