‘ఉత్తర కొరియాకా మాకా.. తేల్చుకోండి’

17 May, 2017 12:19 IST|Sakshi
‘ఉత్తర కొరియాకా మాకా.. తేల్చుకోండి’

న్యూయార్క్‌: మరో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలు, నిత్యం అణుక్షిపణుల పరీక్షలతో ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పుతున్న ఉత్తర కొరియా తీరు చూసిన అమెరికాకు ఆగ్రహం వచ్చింది. ఉత్తర కొరియాకు మద్దతిచ్చే నగరాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి ద్వారా ఉమ్మడిగా చేసుకున్న ఒప్పందాలను మర్చిపోయారా అంటు నిలదీసింది.‘మీరు ఉత్తర కొరియాకు మద్దతు ఇస్తారా.. లేక మాకు మద్దతు ఇస్తారా’ అని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న నిక్కీ హేలీ సూటిగా ప్రశ్నించారు.

త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో హేలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఉత్తర కొరియా చేసిన బాలిస్టిక్‌ రాకెట్‌ పరీక్షను భద్రతామండలి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. తాము కొత్తగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్‌ రాకెట్‌ను పరీక్షించామంటూ ఉత్తర కొరియా చెప్పిన నేపథ్యంలో అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది.

>
మరిన్ని వార్తలు