పాక్‌కు అమెరికా వార్నింగ్‌

8 Aug, 2019 09:24 IST|Sakshi

న్యూయార్క్ : జమ్మూ కశ్మీర్‌ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్న అమెరికా ఇదే అంశంపై సంయమనం పాటించాలని పాకిస్తాన్‌ను కోరింది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై భారత్‌ తమకు సమాచారం ఇవ్వలేదన్న అమెరికా ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కశ్మీర్‌ పరిణామాలపై స్పందించింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది.

కాగా, జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలన్న భారత్‌ నిర్ణయం నేపథ్యంలో పాకిస్తాన్‌ ఎలాంటి ప్రతిచర్యలకు పాల్పడరాదని, వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను ప్రోత్సహించడం వంటి చర్యలను మానుకోవాలని స్పష్టం చేసింది. తమ భూభూగంలోని ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలపై చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ ప్రతినిధి పాకిస్తాన్‌ను  కోరారు.

>
మరిన్ని వార్తలు