సౌదీపై ఆంక్షలేం ఉండవు: ట్రంప్‌

22 Nov, 2018 05:47 IST|Sakshi

వాషింగ్టన్‌: జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గీ హత్యకు సంబంధించి సౌదీ అరేబియాపై చర్యలు, ఆంక్షలేవీ విధించకూడదన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకున్నారు. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను నెరపడం, ముడి చమురు ధరలు తక్కువగా ఉండేలా చూడటమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో కంట్రిబ్యూటర్‌గా పనిచేసే ఖషోగ్గీని సౌదీ అరేబియా అధికారులు గత నెలలో ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో దారుణంగా హత్య చేయడం తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు