భారత్‌కు అమెరికా సాయం

14 May, 2020 08:10 IST|Sakshi

న్యూఢిల్లీ : కోవిడ్‌ మహమ్మారిపై భారత్‌ చేస్తోన్న పోరాటానికి 3.6 మిలియన్‌ డాలర్ల ఆర్థికసాయం చేసేందుకు అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అంగీకరించింది. తొలి విడత నిధులను కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగిస్తారు. ఇన్‌ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌(ఐపీసీ) కేంద్రాలను అభివృద్ధిపరచడం కోసం, కోవిడ్‌ కేసులను గుర్తించేందుకు, ఆసుపత్రి నెట్‌వర్క్‌ని మెరుగుపరిచేందుకు, పర్యవేక్షణ, నిఘా వ్యవస్థల ద్వారా స్థానిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.

మరిన్ని వార్తలు