‘ఘోస్ట్‌ బేబీ.. ఆయన్ని చంపేయాలి’

22 Oct, 2019 10:54 IST|Sakshi

తన చిన్నారి పక్కనే పడుకున్న మరో ‘పాపాయి’ ఫొటో చూసి ఓ మహిళ బెంబేలెత్తిపోయింది. బేబీ మానిటర్‌లో చూసిన ఆ దయ్యాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రలేకుండానే గడిపింది. తెల్లవారి వెళ్లి చూసే సరికి అసలు విషయం తెలిసి నవ్వుకోవడంతో పాటుగా భర్తను చెడామడా తిట్టేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే... మర్తిజా ఎలిజబెత్‌ అనే మహిళ తన భర్త, కొడుకు(18 నెలలు)తో పాటు ఇల్లినాయిస్‌లో జీవిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కొడుకును ఊయలలో పడుకోబెట్టి లైట్లు ఆఫ్‌ చేసి నిద్రకు ఉపక్రమించింది. మధ్యరాత్రిలో లేచి ఒకసారి బేబీ మానిటర్‌ను చెక్‌ చేసింది. అందులో తన కొడుకుతో పాటుగా మరో చిన్నారి ఉన్నట్టుగా కనిపించిన దృశ్యాలు ఆమెను భయపెట్టాయి. రాత్రంతా మానిటర్‌ చెక్‌ చేస్తూనే ఉండిపోయిన ఎలిజబెత్‌ తెల్లవారి లేచిన తర్వాత అతడి గదిలోకి వెళ్లి చూసింది. 

రాత్రి కనిపించిన ఘోస్ట్‌ నిజంగానే ఇక్కడే ఉందా అంటూ వెదుకుతున్న సమయంలో కొడుకు బెడ్‌పై ఉన్న చిన్నారి ప్రింట్‌ చూసి ఊపిరిపీల్చుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఎలిజబెత్‌.... ‘నిజానికి అది గోస్ట్‌ బేబీ కాదు. పరుపుపై ఉన్న డిజైన్‌. నాకు తెలియకుండా మా ఆయన క్రిబ్‌ బెడ్‌షీట్‌ మార్చారు. అది కూడా సరిగ్గా వేయలేదు. దీంతో నా కొడుకు రాత్రి దానిని దగ్గరకు లాక్కొని పడుకోగా... పరుపుపై ఉన్న డిజైన్‌ వింత ఆకారంలా తోచింది. దాన్ని చూసి నేను భయపడిపోయాను. ఇలా చేసినందుకు మా ఆయనను చంపేయాలి. మీలో చాలా మందికి కూడా ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి కదా’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా