అమెరికా‌: పోలీసుల చర్యతో తల పగిలింది!

5 Jun, 2020 10:32 IST|Sakshi

న్యూయార్క్‌: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతిపై అమెరికా వ్యాప్తంగా గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈక్రమంలో నిరసనలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన న్యూయార్క్‌ బఫెలో పోలీసులు ఓ వ్యక్తిని తోసేసిన వీడియో వైరల్‌ అయింది. నిరసన తెలుపుతున్న ఓ తెల్ల జుట్టు వ్యక్తి బఫెలో పోలీసుల కవాతుకు అడ్డుగా వచ్చి ఏదో చెప్పబోయాడు. దాంతో కవాతులోని ఓ పోలీసు అతన్ని లాఠీతో నెట్టేశాడు. మరో పోలీసు కూడా చేత్తో బలంగా తోయడంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతను బలంగా నేలను తాకడంతో తలకు బలమైన గాయమై రక్తం స్రావమైంది. (చదవండి: అతివాద గ్రూపులపై అమెరికా టార్గెట్‌)

అయినప్పటికీ ఆ పోలీసులు కనికరించలేదు. అతనిపై దాడికి యత్నించారు. అంతలోనే మిగతా పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇక ఈ దృశ్యాన్ని స్థానిక రేడియా స్టేషన్‌ డబ్ల్యూఎఫ్‌ఓ వీడియో తీసి.. ట్విటర్‌లో పోస్టు చేసింది. సమీపంలో ఉన్న మెడికల్‌ సిబ్బంది స్పందించి అతన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారని డబ్ల్యూఎఫ్‌ఓ పేర్కొంది. కాగా, తెల్ల జుట్టు వ్యక్తిని నెట్టేసిన పోలీసులను పై అధికారులు సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి నిలకడ ఉందని డబ్ల్యూఎఫ్‌ఓ తెలిపింది.
(చదవండి: ఉద్యమ నినాదం.. 8.46)

>
మరిన్ని వార్తలు