ఆమెను 'సోకాల్డ్‌' అని ఎందుకన్నామంటే!

2 Jun, 2016 14:31 IST|Sakshi
ఆమెను 'సోకాల్డ్‌' అని ఎందుకన్నామంటే!

న్యూఢిల్లీ: భారత లెజండ్ సినీ గాయని లతా మంగేష్కర్‌ను ఉద్దేశించి 'సోకాల్డ్‌' ప్లేబ్యాక్‌ సింగర్‌ అంటూ కథనాన్ని ప్రచురించడంపై తాజాగా న్యూయార్క్‌ టైమ్స్ పత్రిక వివరణ ఇచ్చింది. 'సోకాల్డ్‌' పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ ప్రఖ్యాత గాయనిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చింది.

లత, సచిన్‌ టెండూల్కర్‌ లను ఉద్దేశించి వెకిలి హాస్యపు వీడియో పెట్టి కమెడియన్‌ తన్మయ్‌ భట్‌ దుమారం రేపిన సంగతి తెలసిందే. ఈ వివాదంపై కథనాన్ని రాస్తూ ఆమె ఒక అనామక గాయని అన్న తరహాలో 'సోకాల్డ్‌' అని పేర్కొంటూ అమెరికా దినపత్రిక న్యూయార్క్ టైమ్స్‌ కథనాన్ని ప్రచురించింది. లతను అవమానపరిచేలా ఈ కథనం ఉండటంతో ట్విట్టర్‌లో ఆ పత్రిక తీరుపై భారతీయులు మండిపడ్డారు. 1943 నుంచి సినీ పాటలు పాడుతూ.. 13భాషల్లో మధురమైన గీతాలు ఆలాపించి.. భారత రత్న కీర్తిని పొందిన అంత గొప్ప గాయనిని ఇలా అనామక నేపథ్య గాయని అంటూ కథనాన్ని రాస్తారా? అని పలువురు మండిపడ్డారు. దీంతో న్యూయార్క్‌ టైమ్స్‌లో పనిచేస్తున్న భారతీయ రచయిత అసీమ్‌ ఛాబ్రా విమరణ ఇచ్చారు. తాము లతను అవమానపరచలేదని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు