మట్టిని కాపాడి.. భూతాపం తగ్గించండి!

7 Oct, 2017 03:39 IST|Sakshi

భూతాపాన్ని తగ్గించేందుకు చెట్లు పెంచడం మొదలుకొని.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో అందరూ మట్టిని మరచిపోతున్నారని.. మట్టిని నమ్ముకుంటే వాతావరణంలోని కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మట్టిని సక్రమంగా వినియోగించుకోగలిగితే ఎలాంటి దుష్ప్రయోజనాలు లేకుండానే వాతావరణంలోని విష వాయువులను తగ్గించొచ్చని, అదే సమయంలో ఇతర ప్రయోజనాలూ పొందొచ్చని అంటున్నారు.

మట్టిలో ఉండే కుళ్లిపోతున్న మొక్కల అవశేషాలు, జంతు కళేబరాలు వగైరాలు వాతావరణం, చెట్ల కంటే ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేసుకోగలుగుతా యని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అడవులు నరికివేయడం, కాల్చడం, ఎరు వులు  వాడటం వంటి చర్యల వల్ల మట్టిలోని కార్బన్‌ వాతావరణంలోకి చేరి ప్రమాదరకంగా మారుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవత్త రాబ్‌ జాక్సన్‌ అంటున్నారు.

ఏడాది పొడవునా పశువుల గడ్డి, ఇతర మొక్కలను పెంచడం.. మేపడం, వ్యవసాయం కోసం దుక్కి దున్నడాన్ని తగ్గించడం ద్వారా కార్బన్‌ను మట్టిలోనే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయొచ్చని.. సారవంతమైన నేల పైపొర కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించడం ద్వారా మొక్కల వేళ్ల ద్వారా కార్బన్‌ మరింత లోతుల్లోకి చేరిపోతుందని రాబ్‌ వివరించారు. పరిశోధన వివరాలు యాన్యువల్‌ రివ్యూ ఆఫ్‌ ఎకాలజీ, ఎవల్యూషన్‌ అండ్‌ సిస్టమాటిక్స్‌ అండ్‌ గ్లోబర్‌ చేంజ్‌ బయాలజీలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు