'నన్ను అలా అనేముందు ఆలోచించుకోవాలి'

3 May, 2016 12:31 IST|Sakshi
'నన్ను అలా అనేముందు ఆలోచించుకోవాలి'

లండన్: బ్యాంకులకు భారీ మొత్తంలో ఐపీ పెట్టి ప్రస్తుతం విదేశాలకు చెక్కేసిన ఒకప్పటి వ్యాపార దిగ్గజం, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మీడియాపై మండిపడ్డారు. ఏదైనా ప్రచారం చేసేముందు నిజనిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అసలు తనను ఎలా ఎగవేతదారుడని అంటారని ప్రశ్నించారు. కుదిరితే సమస్యను పరిష్కరించే మార్గం సూచించాలిగానీ మరింత పెద్దదిగా చేస్తే ఎలా అంటూ ట్వీట్ చేశారు.

'వారు చెప్పినట్లుగా జగడానికి పోవడం కాదు కానీ నేను ఎంతో వినమ్రంగా ఇండియన్ మీడియాకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నన్ను ఎగవేత దారుడనే ముందు నిజనిజలేమిటో ఒకసారి తనిఖీ చేసుకోవాలి' ఆయన ట్వీట్ చేశారు. 'సర్దుబాటు అవకాశం ఇవ్వకుండా నేనెందుకు ఎగవేతదారుడిని అవుతాను' అని ఆయన ప్రశ్నించారు. ఆర్థికపరమైన సమస్యలను నెమ్మదిగా సర్దుబాటు చేయాలని తాను ప్రయత్నిస్తుంటే ఉద్దేశపూర్వకంగానే తాను ఎగవేతకు పాల్పడినట్లుగా ప్రచారం చేశారని, అది చాలా బాధను కలిగించిందని చెప్పారు. రాజ్యసభ సభ్యత్వం నుంచి మాల్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు రోజే మాల్యా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు