ఈ బుడ్డోడు నిజంగా సూప‌ర్‌

9 Jul, 2020 21:00 IST|Sakshi

ఈ రోజుల్లో పిల్ల‌లు న‌టించ‌మంటే జీవించేస్తున్నారు.  పిల్ల‌లు ఎంత న‌వ్వించ‌నా ఒక్కోసారి న‌వ్వ‌రు. అదే వాళ్లు ఇత‌రుల‌ను న‌వ్వించ‌డానికి మాత్రం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న యాక్టింగ్ చేస్తే చాలు. వారి యాక్టింగ్‌ను త‌ల్లి కూడా ప‌సిగ‌ట్ట‌లేదు. తాజాగా ఒక బుడ్డోడు చేసిన ప‌ని అంద‌రికి న‌వ్వు తెప్పిస్తుంది. ఒక పాత వీడియోను మాజీ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ రెక్స్ చాప్మ‌న్ రీట్వీట్ చేశారు.(‘అక్కడికి వచ్చి నన్ను పిలవండి.. వస్తాను’)

21 సెకండ్ల నిడివి ఉన్న‌ ఈ వీడియోలో బుడ్డోడి త‌ల్లి వాడిని ఊయ‌ల ఊగ‌మ‌ని చెప్పింది. త‌ల్లి మాట‌కు క‌ట్టుబ‌డి ఊయ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ ఆ బుడ్డోడు దానిమీద కూర్చోకుండానే ఊయ‌ల‌ను ఊపాడు. అయితే ఇక్క‌డే ఆ బుడ్డోడు ఏం చేశాడో తెలుసా..  జ‌స్ట్ అలా ఊయ‌ల తాకిందో లేదో ఏదో గ‌ట్టిగా త‌గిలిన‌ట్లు కింద‌ప‌డి దొర్లడం ప్రారంభించాడు.  ఎవ‌రైనా చూస్తే అయ్యో.. చాలా గ‌ట్టిగా త‌గిలిన‌ట్లుందే అనుకుంటారు. బుడ్డోడు చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 2.6 మిలియ‌న్ల‌కు పైగా వీక్షించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు