ప్రసవ వేదన తట్టుకోలేక.. దూకేసింది

9 Sep, 2017 09:34 IST|Sakshi
ప్రసవ వేదన తట్టుకోలేక.. దూకేసింది

సాక్షి, బీజింగ్‌:   ప్రపంచ వ్యాప్తంగా మహిళ  పునరుత్పత్తి హక్కులను మరోసారి  చర్చకు తెచ్చిన ఉదంతమిది. బిడ్డను ఎపుడు ఎలా కనాలనే నిర్ణయాధికారం మహిళలకు పీడకలగానే మిగులుతోంది.  చైనాలో   ఇలాంటి ఘటనకు  సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు  వైరల్‌ అయింది. పురుటి నొప్పులను తట్టుకోలేని ఓ  మహిళ  అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం విభ్రాంతికి గురి చేసింది.  చనిపోవడానికి ముందు నొప్పితో విలవిల్లాడుతూ..కుటుంబ సభ్యులను వేడుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి.

చైనాకు చెందిన మహిళ (24) ప్రసవ వేదనను భరించలేక ఆసుపత్రి భవనంలోని 5వ అంతస్తు నుంచి దూకేసింది. దీంతో తల్లీ, బిడ్డ ఇద్దరూ  కన్నుమూశారు.  బిడ్డతల పెద్దదిగా ఉండటంతో నార్మల్‌ డెలివరీ చాలా కష్టమైంది. దీంతో సిజేరియన్ డెలివరీ కోసం తన కుటుంబాన్ని వేడుకుంది. అయితే చైనా చట్టాల ప్రకారం దీనికికుటుంబసభ్యుల అనుమతి తప్పనిసరి. ఈ విషాద సంఘటనతో మహిళల పునరుత్పాదక హక్కులను కోరుతూ  అక్కడి మహిళలు  నిరసననకు దిగారు.