పాక్‌లో పండుగ సంబరాలు : వైరల్‌ వీడియో

30 Mar, 2019 12:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా మత, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజల్ని సమీకృతం చేసే ఏకైక సందర్భం పండుగలు. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్‌, భారత మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాసగుతుండగా మరోవైపు పాకిస్తాన్‌లో హోలీ సంబరాలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం విశేషంగా నిలిచింది. దీనికి  సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ఇపుడు హల్‌చల్‌ చేస్తోంది. నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంటోంది. 

ఇస్లామాబాద్‌లోని క్వాయిడ్-ఐ-అజమ్ యూనివర్సిటీ  విద్యార్థులు హోలీ సంబరాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మార్చి 25వ తేదీన విశ్వవిద్యాలయ మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమతాలకతీతంగా అందరూ స్టెప్పులేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ చక్కర్లు కొడుతోంది. 

కాగా పుల్వామా ఉగ్రదాడి దాయాది దేశాల మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని రాజేసింది. ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకు వెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది  సీఆర్‌పీఎఫ్‌ జవానులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు