వైరల్‌ : ఇంతకీ ఈ వింత ఆకారం ఏంటి?

23 Nov, 2019 18:12 IST|Sakshi

అదేంటి ఆక్టోపస్‌ ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఏంటి అనుకుంటున్నారా!. కానీ ఇది నిజం.. అయితే ఒక్కోసారి మనం చూసే కొన్ని వీడియోలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. మనకు ఎప్పుడైనా వింత జంతువులు కనపడితే దానిని కనిపెట్టలేక అదొక మిస్టరీగా మిగిలిపోతుంది. తాజాగా ఒక ఆక్టోపస్‌ సముద్రంలో వేగంగా ఈదుతూ ఊసరవెల్లిలా రంగు మారుస్తున్న వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియోలో ఆక్టోపస్‌ వేగంగా ఈదుతూ సముద్రం రంగుకు అణుగుణంగా తన ఆకృతితో పాటు రంగును మార్చుకోవడం ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోనూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో చూసిన వారంతా మంత్ర ముగ్దులవుతున్నారు. వీడియోలో ఆక్టోపస్‌ రంగులు మార్చడం చూసి కొంతమంది ఆశ్చర్యానికి లోనవ్వగా, మరికొందరు మాత్రం ఇది వేరే ప్రపంచం నుంచి వచ్చిన వింత ఆకారం అని కామెంట్లు పెడుతున్నారు. ' కేవలం మనల్ని మభ్యపెట్టేందుకు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు. అయినా ఆక్టోపస్‌ సముద్రంలో అంత వేగంగా ఈదుతూ రంగుల ఎలా మారుస్తుందో తనకు అర్థం కావడం లేదని' ఒక నెటిజన్‌ ట్విటర్‌లో అభిప్రాయపడ్డాడు. నిజంగా ఇది ఆక్టోపస్‌ అవునో కాదో నిర్థారించుకోవాలంటే మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా