ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది

19 Feb, 2020 18:12 IST|Sakshi

లండన్‌ : డాక్టర్లు బ్రెయిన్‌​ సర్జరీ చేస్తుండగానే  సదరు మహిళ వయొలిన్‌ పరికరాన్ని వాయించి  అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఘటన బ్రిటన్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాలు.. లండన్‌కు చెందిన 53 ఏళ్ల డాగ్మార్‌ టర్నర్‌ గత కొంత కాలంగా అరుదైన బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజీ ఆసుపత్రి న్యూరో సర్జన్‌ కీమౌర్స్ అష్కాన్ దగ్గర ట్యూమర్‌కు సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ట్యూమర్‌ పరిధి బ్రెయిన్‌ కుడి భాగం మొత్తం విస్తరించడంతో వెంటనే ఆపరేషన్‌ చేసి ట్యూమర్‌ తొలగించుకోవాలని,లేకపోతే వెంటనే ప్రాణం పోతుందని కీమౌర్స్ అష్కాన్ సూచించారు.(జస్ట్‌ మిస్‌.. కొద్దిలో ప్రాణం పోయేదే)

ఇదిలా ఉండగా టర్నర్‌కు సంగీతమంటే మహా ప్రాణం.. ఎంతలా అంటే ఆమె గత 40 ఏళ్లుగా వయొలిన్‌ పరికరాన్ని ఎంతో ఇష్టంగా వాయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సమయంలో తనకు వయొలిన్‌ వాయించడానికి అనుమతి ఇవ్వాలని టర్నర్‌ అష్కాన్‌ను కోరారు. మొదట ఆమె అడిగినదానికి ఒప్పుకోని అష్కాన్‌ టర్నర్‌కు సంగీతంపై ఉన్న ఇష్టంతో కాదనలేకపోయాడు. ఆపరేషన్‌ సమయంలో ఆమెకు మత్తు ఇవ్వకుండానే బ్రెయిన్‌లోని ట్యూమర్‌ను తొలగించారు. అయితే కణితిని తొలగించినంత సేపూ ఆమె ఎడమ చేయిలో వయొలిన్‌ పట్టుకొని కుడిచేత్తో వాయించిన తీరు హృదయాన్ని హతుత్కునేలా  ఉంది. అయితే ఇదంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో ఫేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. (బల్లి నోట్లో నోరు పెట్టాడు..)

'ఒక ఆపరేషన్‌ సయయంలో పేషంట్‌ ఇలా సంగీత పరికరం వాయించడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి అనుకుంటా.ఆమె సంగీతానికి ఎటుంటి ఆటంకం కలగించకుండానే శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాం' అని అష్కాన్‌ పేర్కొన్నారు. ' నాకు అవకాశం కల్పించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆపరేషన్‌ సమయంలో వయొలిన్‌ ప్లే చేయలేనేమో అని బాధపడ్డా. వయొలిన్‌ వాయించడమనేది నా అభిరుచిగా ఉండేది. నేను 10 సంవత్సారాల వయసు నుంచే వయొలిన్‌ వాయించడం నేర్చుకున్నా' అంటూ టర్నర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని వార్తలు