ద‌య‌చేసి వాటిని తిరిగిచ్చేయండి..

24 Jun, 2020 17:03 IST|Sakshi

వాషింగ్ట‌న్‌: అమెరికాలోని ఓ డైరీ ఫామ్‌లో దొంగ‌లు ప‌డ్డారు. అయితే రోజు తిరిగేస‌రికి ఆ దొంగ‌లు ఎత్తుకెళ్లిన మేక‌పిల్ల‌ల‌ను పాక‌లో వ‌దిలిపెట్టి వెళ్లిపోయారు. దొంగ‌ల మ‌న‌సు మార‌డానికి కార‌ణ‌మేంటా అని ఆలోచిస్తున్నారా.! ఎలాగో చదివేయండి.. జూన్ 22న అమెరికాలోని డైరీఫామ్ నుంచి చిన్నచిన్న మేక‌పిల్ల‌ల‌ను దొంగ‌లు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వాటిని పెంచుచుతోన్న డైరీ ఫామ్ నిర్వాహ‌కులు సోష‌ల్ మీడియాలో భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు. "గ‌త రాత్రి కొంద‌రు ఆరు మేక పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లారు. అప్ప‌టి నుంచి నేను, నా కొడుకు పిచ్చివాళ్ల‌మైపోయాం. వాటిని మా పిల్ల‌ల్లా చూస్తాం. ద‌య‌చేసి వాటిని తిరిగిచ్చేయండి. వాటికి రెండు నెల‌ల వ‌య‌సు కూడా లేదు. (మేక‌, బొప్పాయి పండుకు క‌రోనా పాజిటివ్‌!)

అస‌లే అవి ఆక‌లిగా ఉన్నాయి, ఇప్పుడింకా ఎంత భ‌య‌ప‌డుతున్నాయో! మేము వాటిని మిస్స‌వుతున్నాం. నా పిల్ల‌లు త‌న స్నేహితుల‌ను(పెంపుడు మేక‌లు) కోరుకుంటున్నారు. వాటికి ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌కుండా తిరిగి ఇచ్చేస్తే మేము ఎక్క‌డా ఫిర్యాదు చేయ‌మ‌ని రాసుకొచ్చింది. అయితే ఇది ఆ దొంగ‌ల కంట ప‌డిన‌ట్టుంది. ఇది చ‌దివి వారి హృద‌యం ద్ర‌వించిన‌ట్లుంది. వెంట‌నే మరుస‌టి రోజు వాటిని ఎక్క‌డ నుంచి ప‌ట్టుకొచ్చారో అక్క‌డే వ‌దిలేశారు. ఈ విష‌యాన్ని డైరీ ఫామ్ నిర్వాహ‌కులు "మేక‌పిల్ల‌లు తిరిగి ఇంటికి వ‌చ్చేశాయ్" అంటూ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డిస్తూ ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌లు వాటిని హ‌త్తుకుని ఆడుకుంటున్న ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. (మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!)

మరిన్ని వార్తలు