ఆస్ప‌త్రిలో ఒక్క‌టైన డాక్ట‌ర్, న‌ర్స్‌

28 May, 2020 19:37 IST|Sakshi

లండ‌న్‌: ఓ డాక్ట‌రు, న‌ర్సు పెళ్లి చేసుకున్నారు. ఇందులో వింతేముందీ అనుకుంటున్నారా? అవును, వారు సేవ‌లందించే ఆసుప‌త్రిలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. యూకేకు చెందిన‌ జాన్ టిప్పింగ్, అన్న‌ల‌న్ న‌వ‌రత్నం ఆగ‌స్టులో వారి వివాహ‌ వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ అక‌స్మాత్తుగా వ‌చ్చిన క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల పెళ్లి ప‌నులు ర‌ద్దు చేసుకున్నారు. పైగా ఇప్పుడున్న ఆంక్ష‌ల నేప‌థ్యంలో వ‌ధూవ‌రుల కుటుంబాలు ఉత్త‌ర ఐలాండ్‌, శ్రీలంక నుంచి రావ‌డం అంత సులువు కూడా కాదు. దీంతో వాళ్లు పెళ్లిని ముందుకు జ‌రిపారు. ఏప్రిల్‌లో లండ‌న్‌లోని సెయింట్ థామ‌స్ ఆసుప‌త్రిలోని చ‌ర్చిలో ఉంగ‌రాలు మార్చుకున్నారు. (కోవిడ్‌ వ్యాక్సిన్‌: హ్యూమన్‌ ట్రయల్స్‌ షురూ!)

ఈ వేడుక‌ను వారి కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఈ విష‌యం గురించి నూత‌న వ‌ధువు టిప్పింగ్ మాట్లాడుతూ.. "అంద‌రూ ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ఈ వేడుక జ‌రుపుకోవాల‌నుకున్నాం. అంతేకాక మేము ప‌ని చేస్తున్న ఆసుప‌త్రిలోనే పెళ్లి చేసుకోవ‌డం ఇప్ప‌టికీ న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌డం లేదు. దీనికి ఆసుప‌త్రివాళ్లు స‌హ‌క‌రించ‌డం ఎంతో సంతోషంగా ఉంది" అని పేర్కొంది. వీరి పెళ్లి ఫొటోల‌ను ఆసుప‌త్రి యాజ‌మాన్యం రెండు రోజుల క్రితం ట్విట‌ర్‌లో పోస్టు చేయ‌గా వైర‌ల్‌గా మారాయి. కాగా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. అక్క‌డ కరోనా కేసుల సంఖ్య 2.6 ల‌క్ష‌లు దాటిపోయింది. (ఆదివారాల్లో పెళ్లిళ్లకు అనుమతిస్తాం.. !)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా