ఎలుక పెయింటింగ్‌‌కు ఎంత డిమాండో తెలుసా..

22 May, 2020 20:29 IST|Sakshi

లండన్‌ : పెయింటింగ్‌.. సహజంగా వివిధ రంగులతో ఉండి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి కళా రూపాన్ని కొన్ని లక్షలు పోసి కొంటారు. అయితే కళకు మనుషులు, జంతువులు అన్న భేదం లేదని నిరూపించింది ఓ ఎలుక. తన చిట్టి పొట్టి పాదాలతో ఓ కళాఖండాన్ని రూపొందించింది. ఈ చిట్టెలుక గీసిన బొమ్మను వేలు పెట్టి కొంటారని మీకు తెలుసా. అవునండి.. ఎలుక గీసిన చిత్రం ఏకంగా 1000 పౌండ్లు (అక్షరాల 92 వేలు) సంపాందించింది. (బుడ్డోడి వ‌ల‌కు చిక్కిన ఖ‌జానా; కానీ)

వివరాళ్లోకి వెళితే.. మాంచెస్టర్‌కు చెందిన జెస్‌ అనే మహిళ కొన్ని ఎలుకలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుస్‌ అనే ఎలుకతో ఓ పెయింటింగ్‌ వేసింది. డ్రాయింగ్‌ రూమ్‌లో ఎలుక పాదాలను పెయింట్‌లో ముంచి కొన్ని కాగితాలపై ఉంచారు. అది అటు ఇటు తిరుగుతుంటే పేపర్‌పై ఎలుక అడుగులు కలర్‌ఫుల్‌గా‌ ఏర్ప​డ్డాయి. అలా కొన్ని పేపర్లపై వేసిన ఎలుక పాదాల పేయింటింగ్‌లన్నింటినీ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. అలా పెయింటింగ్‌లు అన్ని అమ్ముడుపోగా జెస్‌ మొత్తం 1000 పౌండ్లను రాబట్టింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'ఎలుక చిత్రాలకు ఇంత మార్కెట్‌ ఉందా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుస్‌ ప్రస్తుతం మినీ ‘హెన్రీ మాటిస్సే’ అయ్యిందని ఆమె అన్నారు. (నేను మాస్కు ధరించా.. మరి మీరు: మహేశ్‌)

మరిన్ని వార్తలు