స్నేహితుడిని ఆలింగనం చేసుకుని...

5 Dec, 2019 11:52 IST|Sakshi

బాధలో ఉన్న మనిషిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే వారి వేదన కాస్తైనా తగ్గుతుంది. ‘నీకు నేనున్నా’ అనే భరోసాను ఇచ్చే అటువంటి ఆత్మీయ స్పర్శతో కలిగే ఉపశమనాన్ని మాటల్లో వర్ణించాలనుకుంటే.. ఈ ఫొటోలోని చిన్నారిని చూపిస్తే చాలు. తన స్నేహితుడు ఏడుస్తుంటే తట్టుకోలేక ఓ బాలుడు అతడిని అక్కున చేర్చుకున్నాడు. అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఓదార్చాడు. వీపుపై చేతితో నిమురుతూ అతడిని ఆడించాడు. ఆటిజంతో బాధ పడుతున్న స్నేహితుడిని ఊరడించాడు. అయితే ఇదంతా చేస్తున్న చిన్నారి కూడా డౌన్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నవాడే కావడం విశేషం.

మనసును కదిలించే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంత మంచి మనసురా నీది బుడ్డోడా! స్నేహానికి, మానవత్వానికి నిజమైన అర్థం చెప్పావు. నీ నుంచి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ సదరు బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ రాగా... లక్షల్లో కామెంట్లు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు