ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు

29 May, 2020 08:52 IST|Sakshi

కాలిఫోర్నియా : ఓ ఆదివారం సాయంత్రం కుటుంబంతో అలా బయటకు వెళితే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. రోజూ ఉండే ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. అయితే  ఇన్ని రోజులు లాక్‌డౌన్‌ తో బోరింగ్‌గా ఫీల్‌ అయిన ఓ కుటుంబం ఇటీవల సరాదాగా జూకు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన నాతన్‌ పగ్‌ అనే వ్యక్తి  భార్య, పిల్లలతో కలిసి ఓక్లహోమాలోని జంతుశాలకు వెళ్లాడు. అక్కడ ఉండే జంతువుల కోసం పది డాలర్ల విలువైన ఆహారాన్ని తీసుకెళ్లాడు. కారులో కోక్‌, స్నాక్స్‌ ఉంచుకొని కారులో జూ అంతా తిరుగుతూ జంతువులకు తినిపిస్తున్నాడు. (సింహాలు కూడా ఉహించని ట్విస్ట్‌!)

ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ ఒంటె వారిని చూసి కారు వద్దకు వచ్చింది. ఏమనిపించిందో ఏమో కారులోని వ్యక్తి చేతిలో ఉన్న కోక్‌పై కన్నేసింది. ఇక అంతే కోక్‌ను ఆమాంతం లాగి గుటుక్కున తాగేసింది. ఇది చూసిన కుటుంబం వెంటనే షాక్‌ గురయ్యింది. అయితే ఒంటెకు మాత్రం  ఒక్క కోక్‌ సరిపోలేదేమో కారు వెనక సీట్‌లో ఉన్న పాప చేతిలో మరో కోక్‌ చూసింది. దానిని కూడా బలవంతంగా లక్కొని తాగేసింది. దీంతో ఉలిక్కిపడ్డ చిన్నారి భయంతో ఏడుపు లంకించుకుంది. అక్కడే ఉంటే ఒంటె ఏం చేస్తుందోనని భయపడిన ఆ ఫ్యామిలీ అక్కడ నుంచి కారును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం  సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘చేతిలో తినే వస్తువులు ఉన్నప్పుడు జంతువులు లాక్కోవడం తెలుసు కానీ, ఇలా కారులోకి దూరి దొంగతనం చేయడం ఎప్పుడూ చూడలేదు’ని నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. (సెట్‌లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా