తిమింగలంతో ఆట.. ఎంత బాగుందో!!

8 Nov, 2019 16:35 IST|Sakshi

సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే యజమానుల మాటల్ని బుద్ధిగా వింటాయి. చెప్పిన పని చేస్తాయి. కోతి, కుక్క వంటి జంతువులే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా బెలుగా తిమింగలం కూడా ఈ కోవలోకి చేరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్కిటిక్‌ ధ్రువంలో ప్రయాణించిన కొంతమంది వ్యక్తులు.. బెలుగాతో తాము ఆడిన బంతి ఆట వీడియో షేర్‌ చేయడమే ఇందుకు కారణం. వివరాలు.. జెమిని క్రాఫ్ట్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆర్కిటిక్‌ ధ్రువానికి షికారుకు వెళ్లాడు. బోటులో ప్రయాణిస్తున్న సమయంలో బెలుగా తిమింగలంతో సరదాగా ఆటలు ఆడారు. రగ్బీ ఆట అభిమానులైన క్రాఫ్ట్‌ బృందం రగ్బీ బంతిని నీళ్లలోకి విసురుతూ ఉంటే బెలుగా.. తిరిగి దానిని వాళ్లకు తెచ్చి ఇచ్చింది.

కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 4 మిలియన్లకు పైగా లైకులు సాధించింది. ఈ క్రమంలో... ‘తిమింగలంతో బంతి ఆట. భలే సరదాగా ఉంది. ఈరోజు చూసిన వీడియోల్లో ఇదెంతో కూల్‌గా ఉంది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌ వివరాల ప్రకారం.. బెలుగా తిమింగలాలు ఇతర ప్రాణులతో స్నేహం చేయడానికి ఆసక్తి కనబరుస్తాయి. ఈలలు, చప్పట్లు తదితర శబ్దాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఇతరులు ఇచ్చే సూచనలను పాటిస్తాయి.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా