నేనింకా కన్యనే: భర్త కోసం నటి ప్రకటన

2 Apr, 2016 18:51 IST|Sakshi
నేనింకా కన్యనే: భర్త కోసం నటి ప్రకటన

'వయస్సు 40 ఏళ్లు. కన్య. అరణ్య పుయ్‌ కాబోయే భర్త కోసం ఎదురుచూస్తోంది' అంటూ ఇటీవల బ్యాంకాక్‌లో వెలిసిన ఓ ప్రకటన హల్‌చల్ చేసింది. నటి అరణ్య పుయ్‌ పాథుమ్‌థాంగ్‌ వరుడి కోసం ఇలా చిత్రమైన ప్రటకన ఇచ్చింది. 'వాంట్‌ యూ' పేరిట వెలిసిన ఈ భారీ ప్రకటనలో ఆమె తన ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే సంప్రదించాలని సూచించింది.
 

చనిపోవడానికి ముందు ఒక్కసారైనా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నానని, కన్యగా చనిపోవాలని లేదని ఆమె ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. 'బీ' కేటగిరీ సినిమాల్లో నటించే ఈ అమ్మడు  కేవలం అండర్‌వేర్‌ మాత్రమే ధరించి.. అర్ధనగ్నంగా పోజు ఇస్తూ పెట్టిన ఈ భారీ హోర్డింగ్‌ స్థానికంగా కలకలం రేపింది. ప్రౌఢ సుందరి పెట్టిన ఈ ఘాటు ప్రకటన చూసి బ్యాకాంక్ వాసులు బిత్తరపోయారు.

నిజానికి 45 ఏళ్ల వయస్సు ఉన్న అరణ్య వరుడి కోసం మ్యారేజ్‌ బ్యూరోల్లో, డేటింగ్‌ యాప్స్‌లో తీవ్రంగా ప్రయత్నించింది. తనను పెళ్లి చేసుకోవడానికి తగినవాడు దొరకకపోవడంతో ఆఖరి ప్రయత్నంగా ఈ భారీ ప్రకటనను ఇచ్చింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని లాట్ ఫ్రావ్‌ జిల్లాలోని మంచి కూడలిలో ఈ ప్రకటనను పెట్టింది.

పబ్లిసిటీ కోసం కాకుండా సీరియస్‌గానే జీవిత భాగస్వామి కోసమే ఈ హోర్డింగ్‌ను పెట్టినట్టు ఆమె చెప్తోంది. అయితే పోలీసులుస మాత్రం ఈ అశీల్ల హోర్డింగ్ పెట్టినందుకు యాడ్ ఏజెన్సీపై 10 పౌండ్లు (సుమారు రూ. వెయ్యి) జరిమానా విధించింది. అశ్లీల పోజుతో ప్రకటన ఇచ్చినందుకు సదరు నటిని కూడా ప్రశ్నిస్తామని పోలీసులు చెప్తున్నారు.
 

మరిన్ని వార్తలు