నిజాయితీకి మారుపేరు ఆ ఫ్యామిలీ 

20 May, 2020 10:50 IST|Sakshi
డేవిడ్‌ ఫ్యామిలీకి దొరికిన డబ్బు మూటలు

న్యూయార్క్‌ : వర్జీనియాకు చెందిన డేవిడ్‌ ఫ్యామిలీ సరదాగా బయట తిరిగొద్దామని గత శనివారం పిక్‌అప్‌ ట్రక్‌లో బయలుదేరింది. కరోలైన్‌ కౌంటీనుంచి కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత గూచ్‌లాండ్‌ కౌంటీ వద్ద రోడ్డుపై వారికి ఓ‌ బ్యాగ్‌ కనిపించింది. ఏదో చెత్త బ్యాగ్‌ రోడ్డుకు అడ్డంగా ఉందని భావించిన వారు ట్రక్‌ను ఆపేసి బ్యాగును  వాహనం వెనకాల పడేశారు. కొంత దూరం వెళ్లిన తర్వాత మరో బ్యాగు కనిపించింది. దాన్ని కూడా ట్రక్‌ వెనకాల పడేశారు. కొన్ని గంటలు బయట సరదాగా తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఆ బ్యాగులను తెరిచి చూడగా అందులో డబ్బులు కనిపించాయి. అయితే వారు ఆ డబ్బుపై ఆశపడక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ( సూపర్‌ పవర్స్‌ చిన్నారి, వీడియో వైరల్‌! )

డేవిడ్‌ ఫ్యామిలీ

అక్కడికి చేరుకున్న పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల్లో దాదాపు 1 మిలియన్‌ డాలర్లు( రూ.75 లక్షలు) ఉన్నట్లు గుర్తించారు. డేవిడ్‌ కుటుంబసభ్యుల నిజాయితీని మెచ్చుకున్నారు పోలీసులు. డబ్బు సమాచారం అందించిన ఆ‌ కుటుంబానికి నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అంత డబ్బు రోడ్డు మీదకు ఎలా వచ్చిందా అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ( వంటిల్లుగా మారిన‌ పోలీస్ స్టేష‌న్‌ )

మరిన్ని వార్తలు