టీనేజర్‌ కడుపులో దెయ్యం పిల్ల!

12 Sep, 2019 19:11 IST|Sakshi

వర్జీనియా దేశంలోని రిచ్‌మండ్‌ నగరానికి చెందిన ఐయన్నా కారింగ్టన్‌ (17) అనే టీనేజర్‌ తొలిసారి తల్లి కాబోతోంది. కడుపులో ఉన్న 24 వారాల బేబీ ఎలా ఉందో తెలుసుకునేందుకు సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్‌ చేయించుకుంది. స్కానింగ్‌లో కనిపించిన తన బేబీ దశ్యాన్ని చూసి ఆమెకు గుండె ఆగిపోయినంత పనయింది. జుట్టంతా విరబూసుకొని గుడ్లు తెరచి చూస్తున్నట్లు ఉన్న బేబీ స్కానింగ్‌ చిత్రం అచ్చం దెయ్యం పిల్లలా ఉంది. మిడ్‌ నర్సు నచ్చచెప్పాక తేరుకున్న ఐయన్నా తన బేబీ స్కానింగ్‌ చిత్రాన్ని సోషల్‌ మీడియా మిత్రులకు షేర్‌ చేసింది. 

కొందరు ఐయన్నా లాగా భయాందోళనలు వ్యక్తం చేయగా, మిగతా వారు మార్ఫింగ్‌ ఫొటో అంటూ కొట్టివేశారు. తనకు పుట్టబోతున్న బిడ్డ ఆడో, మగో కూడా తెలియదని ఐయన్నా చెప్పారు. అయితే స్కానింగ్‌ అప్పుడు ఆమె పక్కనే ఉన్న మిడ్‌ నర్సు మాత్రం ఆడ శిశువే అని తెలిపింది. సాధారణంగా కడుపులోని శిశువులు కళ్లు మూసుకొని ఉంటారని, కళ్లు తెరచి చూడరని, ఐయన్నా బిడ్డను స్కానింగ్‌ చేసినప్పుడు ఆపాప కళ్లు బాగా తెరచి కెమేరా వైపు చూడడం వల్ల స్కానింగ్‌లో ఆ పాప దెయ్యంలా కనిపిస్తోందని చెప్పారు. కొందరు గర్భస్త్ర శిశువులు స్కానింగ్‌ అప్పుడు అలా కనిపిస్తారుగానీ, అందరి పిల్లల్లానే ఉంటారని హెడ్‌ నర్సు చెప్పడంతో ఐయన్నా స్థిమిత పడింది. అయినా ఏదో కోశాన అనుమానం ఉన్నట్లు ఐయన్నా కాస్త భయపడుతోంది. అయినా మొదటిసారి తల్లి అవుతున్న ఆనందం వేరులే! అంటూ సరదాగానే ఉంటోంది. 

మరిన్ని వార్తలు