స్నాతకోత్సవం.. వర్చువల్‌గా

24 May, 2020 06:32 IST|Sakshi

వాషింగ్టన్‌: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్‌ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భారత విద్యార్థులు, కుటుంబీకులు, మిత్రులు పాల్గొన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరిగే అన్ని స్నాతకోత్సవాలు రద్దవడం తెల్సిందే. దీంతో ఎంబసీ ఆఫ్‌ ఇండియా స్టూడెంట్‌ హబ్‌ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించింది. అనుకోని ఘటనలే అంతులేని అవకాశాలను కల్పిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అమెరికాలో భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విద్యార్థుల్లోనే భవిష్యత్‌ ఆవిష్కరణ కర్తలు, ఎంటర్‌ ప్రెన్యూర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్, ఎంటర్‌ప్రెన్యూర్‌ లాలిత్య మున్షా, నటి గౌతమి తడిమెల్ల, తబలా మాస్టర్‌ దివ్యాంగ్‌ వాకిల్, ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ వేణు గోపాల్, ఐపీఎస్‌ ఆఫీసర్‌ అపర్ణ కుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు