అబ్బురపరిచే వర్చువల్‌ నీటి అలలు

23 May, 2020 09:28 IST|Sakshi

సియోల్‌: నీటి అలలు వేగంగా ఓ భవనంలోని గాజు గదిలోకి దూసుకుపోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి ఓ అద్భుతమైన దృశ్యం దక్షిణ కొరియా దేశంలో చూడవచ్చు. అవి నిజమైన నీటి అలలు కావు.. వర్చువల్‌ అలలు. సియోల్‌ నగరంలోని ఓ పెద్ద భవనంలో ఉన్న గాజు గదిలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ అవుట్‌‌ డోర్‌ హై డెఫినేషన్‌ స్క్రీన్‌ ప్రోగ్రామ్‌ చేయబడింది. దీంతో నీటి అలలు ఎగిసిపడుతున్నట్లు కనిపిస్తున్న వర్చువల్‌ స్క్రీన్‌ చూపరులను అబ్బురపరుస్తోంది. అనామోర్ఫిక్‌ ఎలుషన్‌గా వర్ణించబడిన ఈ వర్చువల్‌ అలలు 80 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవైన తెరపై ప్రతి గంటకు ఒకసారి నిజంగా నీటి అలలు ఎగిసిపడినట్లు దర్శనమిస్తాయి. అనామోర్ఫిక్‌ ఎలుషన్‌ దృశ్యం కనిపించాలంటే నిర్దిష్టమైన కోణంలో చూడాలి. ఆశ్చర్యపరిచే ఈ  ఆర్ట్‌ను డిస్ట్రిక్ట్‌ అనే సంస్థ రూపొందించింది. ఈ సంస్థకు ఆర్ట్‌# వన్‌ వేవ్‌గా పేరు ఉన్న విషయం తెలిసిందే. ‘మా సంస్థ నుంచి పలు సృజనాత్మకమైన కళలను సృష్టించాలనుకుంటున్నాం’ అని డిస్ట్రిక్ట్‌ సంస్థ డైరెక్టర్‌ జూన్‌ లీ స్టఫ్‌ తెలిపారు. (మృత్యుశకటం.. భీతావహ వాతావరణం)

శామ్‌సాంగ్‌ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీని ఉపయోగించి 1620 చదరపు మీటర్ల స్మార్ట్‌ స్క్రీన్‌లో ఈ అలలకు సంబంధించిన ఆర్ట్‌ను‌ ఇన్‌స్టాలేషన్‌ చేయబడింది. ఈ  తెరను తయారు చేయడానికి సుమారు రెండు నెలలు సమయం పట్టినట్లు డిస్ట్రిక్ట్‌  సంస్థ పేర్కొంది. ఇక ఈ స్క్రీన్‌ రెజల్యూషన్‌​ 7,840 x 1,952 పిక్సెల్స్ ఉంది. ఈ వర్చవల్‌ తెర అలలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే నాలుగు లక్షలు మంది ఈ వీడియోను విక్షించగా, నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. వర్చువల్‌ తెర తయారు చేయటం వెనకు అద్భుతమైన నైపుణ్యం దాగి ఉంది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘దక్షిణ కొరియన్లు ఇంత సాంకేతికతో భవిష్యత్తులో ఇంకా ఎంత ముందుకెళుతారోనని అసూయగా ఉంది’  అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు