ఈ వీడియో చూస్తే ఏడుపొస్తుంది!

22 Jun, 2020 14:20 IST|Sakshi

బాస్కెట్‌ బాల్‌ ఆడే ప్రతి ఒక్కరికి తెలుసు బాస్కెట్‌లో బాల్‌ వేయాలంటే ఎంత కష్టమో. టీవీలో చూస్తున్నప్పుడు బాస్కెట్‌లో బాల్‌ వేయడమే కదా ఎంత తేలికో వేసేయొచ్చు దాంట్లో ఏముంది అనుకుంటాం. కానీ గ్రౌండ్‌లోకి దిగి బాల్‌ పట్టుకుంటేనే అర్థం అవుతుంది బాల్‌ వేయడం ఎంత కష్టమో! అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవాళ్లే అలా ఫీల్‌ అవుతుంటే కంటిచూపు లేని ఓ వ్యక్తి బాల్‌ వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అది కూడా మొదటి ప్రయత్నంలోనే! (వైరల్‌: కుక్కపిల్లను కొత్త పెళ్లికూతురిలా..)

ఫాదర్స్‌ డే సందర్భంగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కళ్లు కనబడని ఓ వ్యక్తి తొలిప్రయత్నంలోనే బాస్కట్‌లో బాల్‌ వేశాడు. అప్పుడు తన కుటుంబం రియాక్షన్‌ ఇంకా ఈ వీడియోని అద్భుతంగా మారే లా చేసింది. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వీడియోని చూస్తే నాకు ఏడుపొస్తుంది అని ఒకరు కామెంట్‌ చేయగా, ఇది పోస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలుస్తోంది అని మరో నెటిజన్‌ ప్రశంసించారు.  (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు