కాలిన గాయాలు త్వరగా మానాలంటే..

8 Nov, 2017 16:01 IST|Sakshi

కాలిన గాయాలు త్వరగా మానాలంటే.. ఇతర ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకకుండా ఉండాలంటే విటమిన్‌ ‘డి’ఎక్కువగా అందివ్వడం మేలని బర్మింగ్‌హామ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్లమేషన్‌ అండ్‌ ఏజింగ్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తద్వారా రోగికి తొందరగా సాంత్వన చేకూరడమే కాకుండా చికిత్సకయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని డాక్టర్‌ ఖలీద్‌ అల్‌ తరా తెలిపారు.

కాలిన గాయాలతో బాధపడుతున్న కొంతమందిని ఏడాది పాటు గమనించాక తామీ అంచనాకొచ్చామని చెప్పారు. విటమిన్‌ ‘డి’ఎక్కువగా ఉన్న వారి గాయాలు తొందరగా మానడమే కాకుండా గాయాలపై మచ్చలు కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అదే సమయంలో కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చేరే వారిలో అత్యధికులు విటమిన్‌ ‘డి’లోపం కలిగిన వారే ఉంటున్నారని వివరించారు.  
 

మరిన్ని వార్తలు