‘ఆర్మీ చేతిలో ఆయన కీలుబొమ్మ’

17 Sep, 2018 16:10 IST|Sakshi
వీకే సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్‌ ఖాన్‌పై భారత విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్‌ పలు ఆరోపణలు చేశారు. పాక్‌ సైన్యం చేతిలో ఆయన కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని వీకే వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కూడా పాక్‌ విషయంలో ఎలాంటి మార్పు రాలేదని.. ఇంతకు ముందు పాక్‌ను పాలించిన వారి అడుగు జాడల్లోనే ఇమ్రాన్‌ కూడా నడుస్తున్నాడని ఆయన అభిప్రాయడ్డారు. ఢిల్లీలో ఫిక్కీ ఆధ‍్వర్యంలో సోమవారం నిర్వహంచిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై చర్చించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ సైన్యం చేతిలో కీలుబొమ్మలా వ్యవరించడం వల్లే పాక్‌ సరిహద్దుల్లో పరిస్థితులు మునుపటిలానే ఉన్నాయని పేర్కొన్నారు. సైన్యాన్ని ఆసరాగా తీసుకుని ఆయన పాలన చేస్తున్నారని.. పాక్‌ విషయంలో భారత్‌ స్పష్టమైన వైఖరిని కలిగి ఉందన్నారు. పంజాబ్‌లో గల వివాదాస్పద కర్తార్‌పూర్ రహదారిని తిరిగి ప్రారంభించాల్సిందిగా పాక్‌ నుంచి ప్రతిపాదన వచ్చిందన్న వార్తలను సింగ్‌ తోసిపుచ్చారు. పాక్‌ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెల్చిచెప్పారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే సిక్కుల గురువైన గురు నాయక్‌ 550వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆ కారిడార్‌ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా గురు నాయక్‌ 550వ జయంతి ఉత్సవాలను 2019లో నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు