బంగ్లా సార్వత్రిక పోలింగ్‌ రక్తసిక్తం

30 Dec, 2018 18:31 IST|Sakshi

ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది మర ణించారు. రాజ్‌షాహి, చిత్తగావ్‌, కుమిల్లా, కాక్స్‌బజార్‌ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. ఇక బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్‌, సిల్హెట్‌లో చెలరేగిన అల్లర్లలో ఒక్కరి చొప్పున మరణించారు. మృతుల్లో పాలక అవామీ లీగ్‌ కార్యకర్తలే అధికంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ప్రధాని షేక్‌ హసీనా సర్వశక్తులు ఒడ్డుతుండగా, అధికార పక్షానికి చెక్‌ పెట్టాలని విపక్ష బంగ్లా నేషనలిస్ట్‌​ పార్టీ (బీఎన్‌పీ) చెమటోడ్చింది.  స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు 40,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన ఓటింగ్  మధ్యాహ్నం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ప్రధాని షేక్ హసీనా ఢాకా సిటీ కాలేజ్ సెంటర్‌లో  ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని నియమించారు.

మరిన్ని వార్తలు