ట్రంప్‌ షాక్‌: ప్రపంచ మార్కెట్లు కుదేలు

23 Mar, 2018 09:07 IST|Sakshi

స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా చైనా దిగుమతులపైన 25శాతం  సుంకాల విధింపునకు సంతకం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. తగిలింది. వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనలు చెలరేగడంతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.  గత ఆరువారాల్లో అతి పెద్ద పతనం నమోదైంది. డోజౌన్స్‌ ( 2.93 శాతం) దాదాపు 724 పాయింట్లు కుప్పకూలింది. ఎస్‌అండ్‌పీ 68 పాయింట్లు(2.5 శాతం) పతనమై 2,644 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్‌ 179 పాయింట్లు(2.4 శాతం) తిరోగమించి 7,167 వద్ద ముగిసింది. వెరసి ఫిబ్రవరి 8 తరువాత అత్యధిక స్థాయిలో నష్టపోయాయి.  ఇదే ట్రెండ్‌ షాంఘై, తైవాన్‌ ఇండెక్స్‌ తదితర ఆసియా మార్కెట్లలో కూడా కనిపిస్తోంది. ఈ నెగిటివ్‌ సెంటిమెంట్‌ కొనసాగే అవకాశాలున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.

ఆసియా మార్కెట్లుకూడా ఇదే బాటలో ఉన్నాయి. దేశీయ స్టాక్‌మార్కెట్లకు కూడా ట్రంప్‌ సెగ తగలనుంది.  ముఖ‍్యంగా శుక్రవారం ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 150 పాయింట్ల పతనం దీనికి సంకేతంగా కనిపిస్తోంది.  దీంతో నిఫ్టీ 10వేల స్థాయికి కిందికి పడిపోవచ్చనే ఆందోళన మార్కెట్‌ వర్గాల్లో నెలకొంది.

>
మరిన్ని వార్తలు