యాంకర్‌ నగ్న ఫొటోలు లీక్‌చేసిన ప్రియుడు!

9 Mar, 2016 15:26 IST|Sakshi
యాంకర్‌ నగ్న ఫొటోలు లీక్‌చేసిన ప్రియుడు!

ఓ యాంకర్‌కు ఆమె మాజీ ప్రియుడు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చాడు. తాము సాన్నిహిత్యంగా ఉన్పప్పుడు దిగిన తన నగ్న ఫొటోలను అతడు ఆన్‌లైన్‌లో లీక్ చేసినట్టు తెలుస్తోంది. నగ్నంగా ఉన్న తన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో ఆమె మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది.

అర్జెంటినాకు చెందిన 25 ఏళ్ల మోడల్‌, టీవీ హోస్ట్‌ ఇవానా నాదల్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫుట్‌బాల్ ఆటగాడైన తన మాజీ ప్రియుడు ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేయడంతో ఆమె కెరీర్‌ అంతా చిన్నాభిన్నామైంది. బెడ్‌ మీద ఆమె పూర్తి నగ్నంగా పడుకున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఈ ఫొటోల్లో ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ.. ఫొటోల్లో ఉన్నది ఇవానానేనని అభిమానులు గుర్తుపట్టారు. ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తుండటంతో ఇవానా ఇవి తన ఫొటోలేనని అంగీకరించింది.

తన మాజీ ప్రియుడే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశాడా? లేక ఎవరికైనా పంపితే వారు పెట్టారా? అన్నది తనకు తెలియదని ఆమె చెప్పింది. అయితే ఈ  ప్రైవేటు ఫొటోలను తాను తన ప్రియుడికి మాత్రమే పంపినట్టు పేర్కొంది. తన ప్రియుడి పేరు ఆమె వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం బ్రెజిల్ జట్టు తరఫున ఆడుతున్న ఫుట్‌బాలర్‌ జొనాథన్ కాలెరి అతనని, అతడే ఈ నిర్వాకానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు